: కంగనా రనౌత్ కు బాలీవుడ్ నటుడు రిషి కపూర్ సలహా
కంగనా రనౌత్... ఇటీవల జాతీయ అవార్డు తీసుకున్న నటి. బాలీవుడ్ నటుడు రిషి కపూర్ కు ఈ చిన్నది చాలా బక్కగా కనిపించిందట. మరింత తినమని సలహా ఇచ్చాడు. ముంబైలో జరిగిన ఓ స్టోర్ ఓపెనింగ్ కార్యక్రమంలో కంగనా, మందిరా బేడీలతో కలిసి రిషి కపూర్ పాల్గొన్నాడు. అనంతరం తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ, "స్టోర్ లాంచ్ ప్రోగ్రామ్ లో కంగనా, మందిరా బేడీలను కలిశాను. వీరు అద్భుతమైన అమ్మాయిలు. మరో విషయం ఏమంటే, వీరు ఏమీ తినట్లేదు. దయచేసి తినాలి" అన్నాడు. అయితే, ఈ విషయాన్ని కంగనాతో ఆయన స్వయంగా చెప్పాడో, లేదో తెలియదు. అలా చెప్పకుంటే మాత్రం తనకు రిషి కపూర్ ఇచ్చిన సలహాను ఆమె ప్రసార మాధ్యమాల నుంచే తెలుసుకోవాలి. ఎందుకంటే కంగనాకు ట్విట్టర్లో ఖాతా లేదు మరి!