: ఖజానాకు రూ. 70 వేల కోట్లు చేరవేసే లక్ష్యంతో మోదీ సర్కారు ప్లాన్


ప్రభుత్వ రంగ కంపెనీల్లో వాటాలను ఉపసంహరించుకోవడం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఖజానాకు రూ. 70 వేల కోట్లను సమకూర్చాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్న మోదీ సర్కారు కీలక అడుగులు వేసింది. ఇందులో భాగంగా, ఈ ఉదయం సమావేశమైన క్యాబినెట్, చమురు రంగంలో సేవలందిస్తున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో 10 శాతం వాటాలను, విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఎన్ టీపీసీలో 5 శాతం వాటాలను బహిరంగ మార్కెట్లో విక్రయించాలని నిర్ణయించింది. ఈ మేరకు క్యాబినెట్ అనుమతి లభించిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా, మార్చి 2016లోగా పీఎస్ యూల్లో వాటాల విక్రయం ద్వారా మొత్తం రూ. 70 వేల కోట్లను సమీకరించాలని బడ్జెట్ లో భాగంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News