: నాలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు


నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు నాలుగు రాష్ట్రాలకు గవర్నర్లను మార్చింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన వెలువరించింది. త్రిపుర గవర్నరుగా బీజేపీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు తథాగత రాయ్ ని నియమిస్తున్నట్టు తెలిపింది. గత ఎన్నికల్లో దక్షిణ కొల్ కతా నుంచి పార్లమెంటుకు పోటీపడ్డ రాయ్ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జార్ఖండ్ గవర్నరుగా ఉన్న సయ్యద్ అహ్మద్ ను మణిపూర్ కు బదిలీ చేస్తూ, ఆయన స్థానంలో పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న ఒడిశా మహిళా నేత దారుపడి ముర్మును నియమించినట్టు వెల్లడించింది. ఇదే సమయంలో 2013 నుంచి అరుణాచల్ ప్రదేశ్ గవర్నరుగా సేవలందిస్తున్న నిర్భయ్ శర్మను మిజోరాం రాష్ట్రానికి బదిలీ చేస్తున్నట్టు వివరించింది. సంఘ్ పరివార్ నేత వి షణ్ముగనాథన్ ను మేఘాలయ గవర్నరుగా, అస్సాం మాజీ కార్యదర్శి జెపి రఖోవాను అరుణాచల్ ప్రదేశ్ గవర్నరుగా నియమించినట్టు రాష్ట్రపతి భవన్ తెలిపింది.

  • Loading...

More Telugu News