: ఆర్టీసీ సమ్మెపై నేడు కీలక చర్చలు...టీ సీఎం, ఏపీ రవాణా మంత్రి వేర్వేరుగా చర్చలు


ఆర్టీసీ కార్మికుల సమ్మెను విరమింపజేసే దిశగా తెలుగు రాష్ట్రాలు నేడు కీలక చర్చలు జరపనున్నాయి. ఇప్పటికే 40 శాతం ఫిట్ మెంట్ ఇచ్చేందుకు సిద్ధపడ్డ తెలంగాణ ప్రభుత్వం, మరోమారు నేడు ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపనుంది. ఈ సారి ఏకంగా ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ నేరుగా కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరపనున్నారు. నేటి భేటీలో సమ్మె విరమణ దిశగా తుది నిర్ణయం తీసుకునేందుకు కేసీఆర్ చర్యలు చేపడుతున్నారు. ఇక ఏపీ విషయానికొస్తే, ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు కార్మిక సంఘాలతో చర్చలు జరపనున్నారు. మరోవైపు నేటి ఉదయం 10.30 గంటలకల్లా సమ్మెను విరమించాలన్న హైకోర్టు ఆదేశాలతో తదుపరి కార్యాచరణపై కార్మిక సంఘాలన్నీ విడిగా భేటీ కానున్నాయి.

  • Loading...

More Telugu News