: జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాద స్థావరాలపై భద్రతా బలగాల ఎటాక్
జమ్మూ కాశ్మీర్లో సోపోర్, బారాముల్లా జిల్లాల్లోని మిలిటెంట్ల స్థావరాలపై భద్రతా సిబ్బంది దాడులు చేశారు. స్థావరాలను ధ్వంసం చేసి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. సోపోర్ జిల్లాలోని సగపొరా అడవుల్లో మిలిటెంట్ల స్థావరాలు ఉన్నాయన్న సమాచారం మేరకు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సోదాల్లో స్థావరాల నుంచి 33 ఐఈడీలు, 44 గ్రనైడ్లు, 4.5 కేజీల గన్ పౌడర్, 8 డిటోనేటర్లు, నాలుగు ఏకే 47 రైఫిళ్లు, 19 పిస్తోళ్లు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా, ఉగ్రవాద స్థావరాల గురించిన వార్తలు వెలువడగానే సర్వత్ర ఆందోళన వ్యక్తమైంది. బీజేపీ మద్దతుతో పీడీపీ అధికారం చేపట్టిన తరువాత పాకిస్థాన్ అనుకూల వర్గం క్రియాశీలకంగా మారుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. భారత భూభాగంలో ఉగ్రవాద స్థావరాలు నిర్వహించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. పాకిస్థాన్ మద్దతువర్గాల పీచమణచాలనే డిమాండ్ పెరుగుతోంది.