: జూన్ 6న ఏపీ రాజధానికి శంకుస్ధాపన


జూన్ 6న ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి శంకుస్ధాపన జరగనుంది. ఈ లోపు వీలైనన్ని ప్రభుత్వ శాఖలను విజయవాడ లేదా గుంటూరుకు తరలించాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. ఈ మేరకు మంత్రి వర్గ ఉపసంఘం వేయాలని నిర్ణయించారు. రాజధాని నిర్మాణ శంకుస్ధాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే నూతన రాజధాని పరిధిలోని తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని భూసమీకరణకు ఇష్టం లేదని న్యాయస్థానానికి వెళ్లిన రైతుల భూములను భూసేకరణ ద్వారా సమీకరిస్తామని మంత్రులు పేర్కొన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News