: చెన్నైకి ముచ్చెమటలు పట్టించిన జహీర్, నదీమ్
ఐపీఎల్ సీజన్-8లో చెన్నై సూపర్ కింగ్స్ కు సరైన సవాలు ఎదురైంది. రాయ్ పూర్ లో జరుగుతున్న 49వ మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ బౌలర్లు అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకుంటున్నారు. ఐపీఎల్ లో ప్రత్యర్ధులను భయపెట్టే ఓపెనర్లుగా పేరుగాంచిన డ్వెన్ స్మిత్, బ్రెండన్ మెక్ కల్లమ్ కు చుక్కలు చూపించారు. మూడేసి ఓవర్లు బౌలింగ్ చేసిన నదీమ్, జహీర్ ఖాన్ చెన్నై బ్యాట్స్ మన్ కు ముచ్చెమటలు పట్టించి, కేవలం 16 పరుగులే ఇవ్వడం విశేషం. బ్రెండన్ మెక్ కల్లమ్ (11) వికెట్ ను జహీర్ ఖాన్ ఖాతాలో వేసుకున్నాడు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు అద్భుతమైన ఫీల్డింగ్ తో ఆకట్టుకుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించి నాకౌట్ కు అర్హత సాధించాలని భావించగా, చెన్నై ఆశలను నీరుగార్చేలా ఢిల్లీ ఆడుతోంది. ఆరు ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కేవలం 16 పరుగులు చేసింది. డ్వేన్ స్మిత్ (5) కు సురేష్ రైనా జతకలిశాడు.