: అప్పుడు రాత్రి వేళల్లో వచ్చేవారు... ఇప్పుడు పట్టపగలే వస్తున్నారు: రాహుల్


ఎన్డీయే సర్కారుపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సునిశిత విమర్శలు చేశారు. యూపీఏ హయాంలో భూసేకరణ బిల్లు తెచ్చేందుకు రెండేళ్లు పట్టిందని, కానీ, ఎన్డీయే సర్కారు దాన్ని కొద్దికాలంలోనే నాశనం చేసిందని దుయ్యబట్టారు. తాము సూచించిన సవరణలకు చోటు కల్పించలేదని మండిపడ్డారు. "భూమి తీసుకోదలిస్తే, దాని యజమాని అనుమతి కోరాలని మేం చెప్పాం. కానీ, మీరు మాత్రం ఎవరి అనుమతి తీసుకోకుండానే భూమిని లాగేసుకుంటామని చెబుతున్నారు. ప్రాజెక్టుల కోసమే అయితే, ప్రభుత్వం వద్ద ఎంతో భూమి ఉంది. కానీ, రైతుల నుంచి భూమిని దొంగిలించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. అప్పట్లో దొంగలు రాత్రుళ్లు వచ్చేవారు, ఇప్పుడు సూటు-బూటు వేసుకుని పట్టపగలే దర్జాగా వస్తున్నారు. ఈ ప్రభుత్వం పేదల వ్యతిరేకి, రైతు వ్యతిరేకి. భూసేకరణ బిల్లును పార్లమెంటులో వ్యతిరేకించలేకపోతే, రోడ్లపైకి వచ్చి నిరసన తెలపడం ద్వారా దాన్ని వ్యతిరేకిస్తాం" అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News