: శ్రీకాకుళం జిల్లాలో దారుణం... షార్ట్ సర్క్యూట్ తో 60 పూరిళ్లు దగ్ధం


శ్రీకాకుళం జిల్లాలోని లావేరు మండలం మురపాక గ్రామంలో నిరుపేదలకు నిలువ నీడ లేకుండా పోయింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో 60 పూరిళ్లు ఏకపెట్టున దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ఇళ్లలో దాచుకున్న డబ్బు, బంగారం, వస్తువులు కాలి బూడిదయ్యాయి. దాదాపు రూ.5 లక్షల ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేశారు. తాము ఇంటి వద్ద లేని సమయంలో ఇళ్లన్నీ కాలిపోయాయని, ఏమీ మిగల్లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమందైతే తీవ్రంగా రోదిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే శ్రీకాకుళం నుంచి రెండు ఫైరింజన్లు, రణస్థలం నుంచి ఒక ఫైరింజను వచ్చి మంటలను అదుపు చేశాయి.

  • Loading...

More Telugu News