: 'స్ట్రీట్ ఫైట్' మృతుడు నబీల్ పోస్ట్ మార్టం సిద్ధం


హైదరాబాదులోని పాతబస్తీ స్ట్రీట్ ఫైట్ లో మరణించిన నబీల్ మహ్మద్ కు సంబంధించిన పోస్ట్ మార్టం నివేదికను ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు పోలీసులకు అందించారు. అతనికి 9 బలమైన దెబ్బలు తగిలాయని, తల, పక్కటెముకలు, కడుపులో బలమైన పిడిగుద్దులు తగలడంతో నబీల్ చనిపోయాడని చెప్పారు. అంతేగాక తలకు రెండువైపులా పిడిగుద్దులు తగిలాయని, స్ట్రీట్ బాక్సింగ్ జరిగిన స్థలంలోనే నబీల్ చనిపోయాడని నివేదికలో పేర్కొన్నారు. మరోవైపు స్ట్రీట్ ఫైట్ కేసులో అరెస్టైన 8 మంది నిందితుల తల్లిదండ్రులను ఈరోజు సౌత్ జోన్ డీసీపీ ఆఫీసుకు పిలిపించారు. వారి సమక్షంలోనే నిందితులకు డీసీపీ సత్యనారాయణ కౌన్సెలింగ్ ఇచ్చారు. నిందితులను రేపు రిమాండ్ కు తరలిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News