: ‘హౌరా’ కు తప్పిన పెనుముప్పు...పట్టాలకు అడ్డంగా ఇనుప కమ్మీలు, నిలిపేసిన డ్రైవర్
హౌరా ఎక్స్ ప్రెస్ కు కొద్దిసేపటి క్రితం పెనుముప్పు తప్పింది. కన్యాకుమారి నుంచి కోల్ కతా వెళుతున్న హౌరా ఎక్స్ ప్రెస్ ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలో ఉన్నట్టుండి నిలిచిపోయింది. ఏం జరిగిందని ఆరా తీసిన ప్రయాణికులు విషయం తెలుసుకుని తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సింగరాయకొండ సమీపంలో గుర్తు తెలియని దుండగులు రైలు పట్టాలకు అడ్డంగా ఇనుప కమ్మీలను పడేశారు. వేగంగా దూసుకొస్తున్నా, పట్టాలపై ఇనుప కమ్మీలను గుర్తించిన రైలు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి రైలును ఆపేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది.