: కార్మికుల సమస్య పరిష్కరించకుంటే రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తాం: జగన్
ఆర్టీసీ కార్మికులకు వైఎస్సాఆర్ కాంగ్రెస్ మద్దతుగా ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కార్మికుల సమస్యలు పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించాలని సూచించారు. రైతు భరోసా యాత్రలో భాగంగా అనంతపురం బస్టాండ్ వద్ద సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను ఈరోజు ఆయన కలిశారు. ఏడు రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. కార్మికులు అడుగుతున్న 43 శాతం ఫిట్ మెంట్ న్యాయబద్ధమేనని, ఇవ్వకుంటే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని అన్నారు. నాలుగు రోజుల్లోగా సమస్య పరిష్కారం కాకుంటే రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తామని జగన్ స్పష్టం చేశారు.