: మళ్లీ తెరపైకి నదుల అనుసంధానం...నేటి ఏపీ కేబినెట్ భేటీలో చర్చంతా దానిపైనే!


టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గతంలో సీఎంగా ఉన్న సమయంలో నదుల అనుసంధానంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఆ తర్వాత ఆ విషయాన్ని పట్టించుకున్న నాథుడే కరవయ్యాడు. పదేళ్ల తర్వాత మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు పరిస్థితులన్నీ చక్కబెట్టుకునేసరికి దాదాపు ఏడాది సమయమే పట్టింది. దీంతో ఆయన మళ్లీ నదుల అనుసంధానాన్ని తెరపైకి తెస్తున్నారు. మరికాసేపట్లో భేటీ కానున్న ఏపీ కేబినెట్ భేటీలో మొత్తం చర్చంతా నదుల అనుసంధానంపైనే జరగనుందట. ఈ మేరకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో కసరత్తు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. గోదావరి, కృష్ణా, తుంగభద్ర, పెన్నా నదులను అనుసంధానం చేయడం ద్వారా వృథాగా బంగాళాఖాతంలో కలిసిపోతున్న నీటిని వినియోగించుకునే వెసులుబాటు లభించనుంది. ఈ దిశగానే నేటి కేబినెట్ భేటీలో చంద్రబాబు సమాలోచనలు చేయనున్నారు.

  • Loading...

More Telugu News