: భాగ్యనగరిలో గూగుల్ అతిపెద్ద క్యాంపస్... దూసుకెళుతున్న కేటీఆర్


భాగ్యనగరి హైదరాబాదులో గూగుల్ అతిపెద్ద క్యాంపస్ ను ఏర్పాటు చేయనుందట. ఇది ఆ సంస్థకు చెందిన ఆసియా క్యాంపస్ లలోకెల్లా అతిపెద్దదట. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ ల మధ్య ఒప్పందం కూడా కుదిరింది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నేటి ఉదయం ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న కేటీఆర్, ఆ దేశంలోని పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న ఆయన గూగుల్ ప్రతినిధులతోనూ భేటీ అయ్యారు. భేటీలో భాగంగా హైదరాబాదులోని సానుకూలాంశాలను కేటీఆర్ వివరించగా, ముగ్ధులైన గూగుల్ ప్రతినిధులు అక్కడికక్కడే ఒప్పందం కుదుర్చుకున్నారు.

  • Loading...

More Telugu News