: ముఖ్యమంత్రి మద్యనిషేధమంటే...మంత్రులు బార్ ఓపెన్ చేశారు


గతంలోలాగా మహారాష్ట్రలో పూర్తి స్థాయిలో మధ్యపాన నిషేధానికి కట్టుబడి ఉన్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. దశల వారీగా ఆ మేరకు చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని కేబినెట్ భేటీ అనంతరం రాష్ట్ర ప్రజలకు తెలిపారు. ఈ నేఫథ్యంలో ఫడ్నవీస్ కేబినెట్లో మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రామ్ షిండే, దీపక్ కేసర్కార్ అహ్మద్ నగర్ లో ఓ బారు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. దీంతో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ముఖ్యమంత్రి మద్యనిషేధం అంటే, మంత్రులు మద్యపానమంటున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. బారుకు రిబ్బన్ కట్ చేయడంతో హోంశాఖ సహాయమంత్రి రామ్ షిండే, ఆర్థిక శాఖ సహాయమంత్రి దీపక్ కేసర్కార్ ఇరకాటంలో పడ్డారు. ఫడ్నవీస్ కు చెడ్డపేరు తెచ్చారంటూ స్వపక్షం నుంచి కూడా విమర్శలు రావడం వారిని ఇబ్బంది పెడుతోంది.

  • Loading...

More Telugu News