: భూకంపం కారణంగా లక్ష మందికి పైగా మహిళలు గర్భం కోల్పోయారు: మనీషా కొయిరాలా


మాతృభూమి రుణం తీర్చుకునేందుకు సినీ నటి మనీషా కొయిరాలా సమాయత్తమవుతోంది. నేపాల్ కు చెందిన మనీషా స్వదేశంలో భూంకంపం సంభవించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. భూకంపం కారణంగా గర్భం కోల్పోయిన మహిళలు, ఇతర అనారోగ్య కారణాలతో బాధపడుతున్న మహిళలకు అవసరమైన సేవలందించేందుకు ఆమె సిద్ధమైంది. ఐక్యరాజ్యసమితి జనాభా నిధి (యూఎన్ ఎఫ్ పీఏ) నేపాల్ విభాగం గుడ్ విల్ అంబాసిడర్ గా నియమితురాలైన మనీషా, కష్ట కాలంలో మాతృదేశానికి సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పింది. భూకంపం కారణంగా లక్షకుపైగా మహిళలు గర్భం కోల్పోయారని, మరో 1.30 లక్షల మంది ప్రసవించేందుకు సిద్ధంగా ఉన్నారని, వారందరికీ యూఎన్ఎఫ్ పీఏ వైద్యసేవలు అందిస్తుందని ఆ సంస్థ నేపాల్ ప్రతినిధి గ్యులియా వెల్లెస్ తెలిపారు. నేపాల్ విభాగం గుడ్ విల్ అంబాసిడర్ గా మనీషా పనితీరు అందర్నీ ఆకట్టుంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News