: షారూఖ్ ను అనుమతించేది లేదు: ముంబై క్రికెట్ అసోసియేషన్ అధికారి


బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ను వాంఖడే స్టేడియంలోకి అనుమతించేది లేదని ముంబై క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు తెలిపారు. 2012 ఐపీఎల్ లో వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ సందర్భంగా షారూఖ్ చేసిన రభస కారణంగా అతనిపై ఐదేళ్ల నిషేధం విధించారు. దీంతో ఈ నెల 14న వాంఖడే స్టేడియంలో కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరగనున్న కీలక మ్యాచ్ ను ఆయన ప్రత్యక్షంగా చూసే అవకాశం కోల్పోయారు. కాగా, గతేడాది జరిగిన ఫైనల్ చూసేందుకు అనుమతిచ్చినా, ఆ మ్యాచ్ రద్దై బెంగళూరులో జరిగింది. దీంతో ఆయన వాంఖడేలో మ్యాచ్ చూడలేకపోయాడు. తాజా మ్యాచ్ కు అనుమతించమని స్పష్టం చేయడంతో, ఈ నెల 16న బ్రౌబోర్న్ స్టేడియంలో కోల్ కతా, రాజస్థాన్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ ను వీక్షించనున్నారు.

  • Loading...

More Telugu News