: 400 పాయింట్ల పైగా లాభంతో ముగిసిన సెన్సెక్స్
ఈ రోజు భారతీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో మార్కెట్లు కదం తొక్కాయి. దీంతో, బీఎస్ఈ సెన్సెక్స్ 402 పాయింట్లు లాభపడి 27,507 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 134 పాయింట్లు పెరిగి 8,325కి ఎగబాకింది. ఈనాటి టాప్ గెయినర్స్ లో బ్యాంక్ ఆఫ్ బరోడా, గుజరాత్ గ్యాస్ కంపెనీ లిమిటెడ్, గుజరాత్ స్టేట్ పెట్రోనెట్, అశోక్ లేల్యాండ్, ఐషర్ మోటార్స్ ఉన్నాయి. ఫ్యూచర్ రీటైల్, హిందూస్థాన్ యూనిలీవర్, జస్ట్ డయల్, రెలిగేర్ ఎంటర్ ప్రైజెస్, సనోఫీ ఇండియాలు నష్టాలను మూటగట్టుకున్నాయి.