: చివరకు ధర్మమే గెలిచింది... హైకోర్టు తీర్పుపై జయలలిత ప్రకటన
అక్రమాస్తుల కేసులో హైకోర్టు తనకు క్లీన్ చిట్ ఇవ్వడంపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత స్పందించారు. రాజకీయ కుట్రతోనే తనపై తప్పుడు ఆరోపణలు చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు పన్నినా చివరకు ధర్మమే గెలిచిందని ఆమె ప్రకటించారు. ఈ మేరకు జయలలిత కొద్దిసేపటి క్రితం పత్రికా ప్రకటనను విడుదల చేశారు. కర్ణాటక హైకోర్టు తీర్పు తమిళుల నమ్మకానికి దక్కిన విజయమని కూడా ఆమె ఆ ప్రకటనలో పేర్కొన్నారు.