: లోక్ సభలో భూ సేకరణ చట్ట సవరణ బిల్లు
భూ సేకరణ చట్ట సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఈరోజు లోక్ సభలో ప్రవేశపెట్టింది. సభలో బిల్లు ప్రవేశపెడుతుండగా విపక్షాలు నినాదాలు చేస్తూ అభ్యంతరం తెలిపాయి. అయినప్పటికీ స్పీకర్ సుమిత్రా మహాజన్ బిల్లు ప్రవేశపెట్టేందుకు అనుమతిచ్చారు.