: అయ్యవార్ల పరీక్షలో పేపర్లు తారుమారు... డీఎస్సీలో తెలుగుకు బదులు ఇంగ్లీష్ పేపర్
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షలో పేపర్లు తారుమారయ్యాయి. తెలుగు పేపర్ పరీక్ష రాసేందుకు వచ్చిన భావి ఉపాధ్యాయుల చేతిలో పరీక్ష నిర్వాహకులు ఇంగ్లీష్ పేపర్ పెట్టారు. దీంతో అభ్యర్థులు తెల్లమొహం వేశారు. అనంతరం అభ్యర్థుల ఆందోళనను పసిగట్టిన నిర్వాహకులు నాలిక్కరచుకుని ఆంగ్లం పేపర్లు లాగేసుకుని తెలుగు పేపర్లు అందజేశారు. విజయనగరంలోని సెయింట్ జోసెప్స్ స్కూల్ లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో ఈ పొరపాటు చోటుచేసుకుంది.