: అటవీ అధికారి అనుమానాస్పద మృతి
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా పనిచేస్తున్న పుల్లయ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన నిన్న అర్ధరాత్రి వరంగల్ జిల్లా ములుగు మండలంలో చోటు చేసుకుంది. జిల్లాలోని సాయంపేట మండలం కాట్రపల్లిలో బీట్ ఆఫీసర్ గా పనిచేస్తున్న ఆయన... ములుగులో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఆ ఇంట్లోనే ఆయన మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ఇంటిని కూలంకషంగా పరిశీలించారు. మృతి పట్ల పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.