: చిత్తుగా ఓడిన ‘రాయల్స్’... ప్లే ఆఫ్ లోకి దూసుకెళ్లిన ధోనీ సేన!


ఐపీఎల్-8లో చెన్నై సూపర్ కింగ్స్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఇప్పటిదాకా లీగ్ దశలో 12 మ్యాచ్ లు ఆడిన ధోనీ సేన ఎనిమిదింటిలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అంతేకాక, నిన్న చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టును చిత్తుగా ఓడించి ప్లే ఆప్ కు దూసుకెళ్లింది. టాస్ గెలిచిన మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకోగా, కెప్టెన్ అంచనాలకు తగ్గట్టు చెన్నై బ్యాట్స్ మన్ బ్రెండన్ మెల్లమ్(81), డు ప్లెసిస్ (29) లు ‘రాయల్స్’ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. చివర్లో ధోనీ (13), డ్వేనీ బ్రేవో (15) తమదైన రీతిలో హిట్టింగ్ చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి చెన్నై 157 పరుగులు చేసింది. ఆ తర్వాత 158 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్లను కోల్పోయి 145 పరుగులే చేయగలిగింది. చెన్నై ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా బంతితో మ్యాజిక్ చేశాడు. నాలుగు ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన జడేజా కేవలం 11 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. దీంతో ‘రాయల్స్’ జట్టు చెన్నై ముందు తోకముడవక తప్పలేదు.

  • Loading...

More Telugu News