: భార్యపై గొడ్డలితో దాడి... కూర రుచిగా వండలేదట!
చివరి వరకు తోడు ఉంటానని, ప్రేమగా చూసుకుంటానని చేసిన పెళ్లినాటి ప్రమాణాలు ఆచరణలో కనిపించడంలేదు. మహబూబ్ నగర్ జిల్లాలో ఓ వ్యక్తి కూర రుచిగా వండలేదని భార్యపై గొడ్డలితో దాడికి దిగాడు. జిల్లాలోని బిజ్జారం గ్రామానికి చెందిన శ్రీశైలం గొర్రెల మందను కాస్తూ పొలం వద్దే ఉన్నాడు. అతడి భార్య ఆహారం తీసుకుని పొలం వెళ్లింది. అయితే, కూర రుచిగా లేకపోవడంతో ఆమెపై శ్రీశైలం ఆగ్రహం వ్యక్తం చేశాడు. మాటామాటా పెరిగింది. దీంతో, పక్కనే ఉన్న గొడ్డలితో భార్యపై దాడి చేయడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. దీనిపై శ్రీశైలం మామ చిన్న మల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ఆరంభించారు.