: విశాఖలో వీధి నాటకం వేసిన ఆర్టీసీ కార్మికులు
సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు వినూత్న రీతుల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని వివిధ కళారూపాల ద్వారా ప్రశ్నిస్తున్నారు. తాజాగా, విశాఖపట్నంలో సమ్మెలో పాల్గొంటున్న ఆర్టీసీ కార్మికులు తమ నటనా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. 'ప్రగతిచక్రం' పేరిట ప్రదర్శించిన ఈ నాటకం ద్వారా మీడియా వర్గాలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. అయితే, ఆర్టీసీ ఉద్యోగుల వీధి నాటకం స్థానికులను మాత్రం బాగానే ఆకట్టుకుంది. వారు నాటకాన్ని ఉత్సుకతతో తిలకించడం విశేషం. కాగా, ఏపీ మంత్రి వర్గ ఉపసంఘంతో ఆర్టీసీ కార్మిక సంఘాల చర్చలు విఫలమవడం తెలిసిందే.