: మన రాజభాషకు అమెరికా వర్శిటీలో స్థానం


భారత జాతీయ భాష హిందీకి అమెరికాలోని మోంటానా యూనివర్శిటీ స్థానం కల్పించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ వర్శిటీలో హిందీ లెర్నింగ్ కోర్సును ప్రవేశపెడుతున్నారు. సౌత్, సౌత్ ఈస్ట్ ఏషియన్ స్టడీస్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ కోర్సును తీసుకువస్తున్నారు. భారత్ కు చెందిన గౌరవ్ మిశ్రా హిందీ కోర్సుకు ఇన్ స్ట్రక్టర్ గా వ్యవహరిస్తారని యూనివర్శిటీ వర్గాలు తెలిపాయి. మిశ్రా ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యక్తి. కాగా, హిందీని రెగ్యులర్ అకడమిక్ సబ్జెక్టుగా ప్రవేశపెట్టేందుకు వర్శిటీ ప్రయత్నిస్తోంది. దీనిపై మోంటానా వర్శిటి లిబరల్ స్టడీస్ ప్రొఫెసర్ రూత్ వనిత మాట్లాడుతూ... ఇదో అరుదైన గౌరవం అని, గొప్ప విజయమని తెలిపారు.

  • Loading...

More Telugu News