: ఆత్మహత్యకు ప్రయత్నించిన టీవీ నటి


గత ఐదేళ్లుగా తెలుగు టీవీ సీరియల్స్ లో నటిస్తూ, మంచి గుర్తింపు పొందిన టీవీ నటి హరిజిత్ కౌర్ అలియాస్ రూప (28) ఆత్మహత్యా యత్నం చేశారు. హుస్సేన్ సాగర్ లోకి దూకి బలవన్మరణానికి పాల్పడాలనుకున్న ఆమె ప్రయత్నాన్ని గుర్తించిన లేక్ పోలీసులు ఆమెను రక్షించారు. వివరాల్లోకి వెళ్తే, ఓ ప్రైవేట్ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్న తన బంధువు కేవల్ సింగ్ తో ఆమె ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ సహజీవనం కూడా చేస్తున్నారు. అయితే, సీరియల్స్ నటించడం మానేయాలని అతను షరతు పెట్టాడు. సీరియల్స్ లో నటిస్తుండటం వల్ల తన కుటుంబీకులు పెళ్లికి ఒప్పుకోవడం లేదని రెండు రోజుల క్రితం అతను రూపకు స్పష్టం చేశాడు. దీంతో, తీవ్ర మనస్తాపానికి గురైన రూప ఆత్మహత్యా యత్నం చేసింది. ఈ క్రమంలో ఆమెను కాపాడిన పోలీసులు... ఆమెకు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, మోసం చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలే తప్ప, ఆత్మహత్యకు పాల్పడరాదంటూ సూచించారు. అనంతరం బాధితురాలి సోదరుడిని పిలిపించి... పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆత్మహత్యకు పాల్పడ్డ రూప... ఆటో భారతి, చంద్రముఖి, అంత:పురం, శిఖరం తదితర సీరియల్స్ లో నటించింది.

  • Loading...

More Telugu News