: తెలంగాణ అవతరణ వేడుకలకు ఆహ్వానం పలుకుతూ 'నిజాం'కు లేఖ రాసిన టీఎస్ ప్రభుత్వం!


హైదరాబాద్ సంస్థానాన్ని పాలించిన ఆసఫ్ జాహీ పాలకులైన నిజాంలకు టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద పీట వేస్తున్న సంగతి తెలిసిందే. రజాకార్ల వ్యవస్థతో తెలంగాణలో అరాచకాలకు నిజాం పాల్పడ్డారని ఓ వర్గం వాదిస్తుండగా... తెలంగాణకు నిజాంలు చేసిన మేలు అంతా ఇంతా కాదు అంటూ కేసీఆర్ కొనియాడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు 8వ నిజాం అయిన నవాబ్ మీర్ బర్కత్ అలీ ఖాన్ ముకరంజా బహదూర్ కు టీఎస్ ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిజాంకు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ లేఖ రాశారు. ప్రజా సంక్షేమం కోసం నిజాంలు ప్రవేశపెట్టిన పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని, ఆ పథకాలను స్వయంగా తిలకించాలని లేఖలో కోరారు.

  • Loading...

More Telugu News