: కావాలంటే ఉద్యోగం వదిలేస్తాం...బంధం మాత్రం వదులుకోం: మహిళలు


వృత్తి పరమైన జీవితం ఎంత సంతృప్తికరంగా ఉన్నప్పటికీ మాతృత్వం ముందు బలాదూరేనని, తమ ప్రాధాన్యత మాతృత్వానికేనని మహిళలు పేర్కొంటున్నారని మాతృదినోత్సవం సందర్భంగా 'ఆశాచాం' నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. నేటి తరం ఉద్యోగినుల్లో నాలుగో వంతు మంది పిల్లలకే తమ తొలిప్రాధాన్యం అని స్పష్టం చేస్తున్నారని సర్వే వెల్లడించింది. వారి కోసం మంచి స్థాయిలో ఉన్న ఉద్యోగాలను సైతం వదులుకుంటున్నారని సర్వే తెలిపింది. పిల్లలు పుట్టిన దగ్గర్నుంచి, ఎదిగేంత వరకు వారి ఆలనాపాలన దగ్గరుండి చూసుకుని, ఆ తరువాత మళ్లీ ఉద్యోగాల్లో చేరేందుకు మొగ్గుచూపుతున్నారని సర్వేలో తేలింది. అలహాబాద్, ఢిల్లీ, జైపూర్, లక్నో, కోల్ కతాల్లో 25 నుంచి 30 శాతం మంది ఉద్యోగినులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాదు, ఇండోర్, ముంబైల్లో 15 నుంచి 20 శాతం మంది కూడా ఇదే అభిప్రాయం వెల్లడించారు.

  • Loading...

More Telugu News