: పద్మ అవార్డులపై రాందేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు


ఏ విషయాన్నైనా సూటిగా, స్పష్టంగా చెబుతుంటారు ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా. అందులో వివాదాస్పద అంశాలున్నా, సంచలనం సృష్టించినా సరే వెనక్కు తగ్గరు. ఇదే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్మ పురస్కారాలపై తాజాగా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ అవార్డుల కోసం లాబీయింగ్ చేస్తారని, రాజకీయంగా పరిచయాలు ఉన్నవారికి, ఆ పలుకుబడి ఉన్నవారికే ఆ అవార్డులు వస్తాయని అన్నారు. అయితే, పద్మశ్రీ నుంచి పద్మభూషణ్ వరకు అన్ని అవార్డులను అర్హులకు, తమ తమ రంగాల్లో సాధించిన కృషి, విజయాలను బట్టి ఇస్తారని ప్రపంచం భావిస్తుందని పేర్కొన్నారు. కానీ లాబీయింగ్ చేసేవాళ్లకు మాత్రమే ఇవి దక్కుతాయని రాందేవ్ వ్యాఖ్యానించారు. కాగా, ఈ ఏడాది పద్మ పురస్కారానికి ఆయనను ఎంపిక చేయనున్నారన్న విషయం వివాదం కావడంతో, అది ప్రకటించకుండానే ఆయన తిరస్కరించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News