: మోదీతో కల్వకుంట్ల కవిత సెల్పీ అదుర్స్!


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కలిసి తెలంగాణ సీఎం కూతురు, నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవిత తీసుకున్న సెల్ఫీ చూసిన వారందరినీ కట్టిపడేస్తోంది. సెల్ఫీలో మోదీ చిరునవ్వులు చిందిస్తుండగా, కవిత మాత్రం మనసారా నవ్వుతూ కనిపిస్తున్నారు. నిన్న తన తండ్రి కేసీఆర్ తో కలిసి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతితో భేటీ అయిన కవిత, తెలంగాణకు సంబంధించిన పలు అంశాలను కేంద్రం వద్ద ప్రస్తావించారు. అనంతరం కవిత ప్రధానితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 13వ ఆర్థిక సంఘం నిధుల విడుదలలో తెలంగాణకు న్యాయం చేయాలని కవిత ప్రధాని మోదీని కోరారు. ఆ తర్వాత ‘‘మీతో ఒక్క ఫొటో తీసుకుంటాను’’ అని ప్రధానిని అడిగిన ఆమె, మోదీ సరేననగానే ఆయన పక్కన నిలబడి సెల్ఫీ తీసుకున్నారు.

  • Loading...

More Telugu News