: ఇక మీరు జోక్యం చేసుకోవాల్సిందే... ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో పిల్ దాఖలు!


తెలుగు రాష్ట్రాల ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తున్న సమ్మెపై జోక్యం చేసుకోవాలంటూ హైకోర్టులో రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్) దాఖలయ్యాయి. తెలుగుదేశం పార్టీ నేత వెంకట్రావు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా, చిత్తూరు జిల్లాకు చెందిన మహ్మద్ గౌస్ అనే వ్యక్తి మరో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. నాలుగు రోజులుగా సాగుతున్న సమ్మె వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారన్న పిటిషనర్లు, తక్షణమే సమ్మెకు చెక్ పడేలా ఆదేశాలు జారీ చేయాలని ఉమ్మడి రాష్ట్రాల సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. వెంకట్రావు పిటిషన్ లో ప్రతివాదులుగా ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఆర్టీసీ, కార్మిక సంఘాల నేతలు ఉన్నారు. సమ్మెను కార్మికులు విరమించేలా చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక కమిటీని నియమించాలని మహ్మద్ గౌస్ కోర్టును కోరారు. ఈ రెండు పిటిషన్లపై మరికాసేపట్లో హైకోర్టు విచారణ చేపట్టనుంది.

  • Loading...

More Telugu News