: పెళ్లి కావాలంటే పులిలా మారాల్సిందే... మధ్యప్రదేశ్ గ్రామంలో వింత ఆచారం
అది మధ్యప్రదేశ్ లోని కుటేలా గ్రామం. రాత్రి బాగా పొద్దుపోయింది. గోండు జాతిలో భాగమైన కుశ్రామ్స్ తెగ చెందిన ఓ పెళ్లి కొడుకు, పెళ్లికూతురు అగ్ని దేవుడి చుట్టూ ఏడు సార్లు తిరిగారు. వరుడు ప్యాంటు, షర్టు ధరించి కళ్లద్దాలతో, వధువు ఎర్ర చీర కట్టుకొని కళకళలాడుతున్నారు. ఇంతలో చిన్న కలకలం. ఓ పంది పరుగెత్తుకుంటూ వచ్చింది. అంతే, వరుడు పులిలా గాండ్రించాడు. ఆ పందిపై పడ్డాడు. కర్రతో నాలుగు దెబ్బలు వేశాడు. చేతులతో ఒడిసిపట్టి మెడ కొరికి రక్తం తాగాడు. కుశ్రామ్స్ తెగల ఆచారం ప్రకారం, ఈ తంతు పూర్తయిన తరువాతే వారిద్దరికీ పెళ్లి జరిగినట్టు లెక్క. పులి వారి దైవం. పులి ఆశీస్సుల కోసం ఇలా చేయాల్సిందేనని గ్రామ పెద్దలు అంటున్నారు. పందిని త్యాగం చెయ్యకుండా పెళ్లి జరిగే ప్రశ్నే లేదని స్పష్టం చేస్తున్నారు. ఆచారాల పేరిట మూగజీవాలను హింసించి చంపే ఈ ఘటనలపై జంతు సంఘాలకు సమాచారం తెలుసో... లేదో?