: సుకుమా జిల్లాలో వందలాది గ్రామస్థుల అపహరణ... మోదీ పర్యటన క్రమంలో మావోల దుశ్చర్య


ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల దుశ్చర్యలు మితిమీరుతున్నాయి. తాజాగా సుకుమా జిల్లాలో వందలాదిమందిని అపహరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు ఛత్తీస్ గఢ్ బస్తర్ ప్రాంతంలోని నక్సల్స్ ప్రభావిత దంతెవాడ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రధాని అయ్యాక మోదీ తొలిసారి ఈ ప్రాంతాన్ని సందర్శించనున్నారు. ఈ క్రమంలో జగదల్ పూర్ నుంచి ఆయన దంతెవాడకు బయలుదేరబోతున్నారు. ఈ నేపథ్యంలోనే మావోలు గ్రామస్థుల అపహరణకు పాల్పడి ఉంటారని స్పష్టమవుతోంది. ఆ మధ్య గ్రనేడ్ లు పేల్చి పోలీసులను హతమార్చిన మావోయిస్టులు, ఆ తరువాత కొంతమంది పోలీసులను కూడా కిడ్నాప్ చేశారు. తాజాగా గ్రామస్థులపై వారు కన్నేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News