: దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ రైళ్లు ఇవే!


ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇందులో భాగంగా, 11న కాచిగూడ నుంచి విజయవాడకు డబుల్ డెక్కర్ ఏసీ స్పెషల్ ట్రయిన్ తో బాటు, నేడు కాకినాడ నుంచి విజయవాడకు, రేపు తిరుపతి నుంచి కాచిగూడకు ప్రత్యేక రైళ్లను వేసినట్టు తెలిపింది. వీటితో పాటు 10, 13 తేదీల్లో విజయవాడ నుంచి తిరుపతికి, 11, 14 తేదీల్లో తిరుపతి నుంచి విశాఖపట్నం మధ్య, 14న విజయవాడ, విశాఖ మధ్య, 15న విశాఖ నుంచి విజయవాడకు స్పెషల్ రైళ్లు తిరుగుతాయని వివరించింది. పలు ఎక్స్ ప్రెస్ రైళ్లలో 2200 అదనపు బెర్త్ లను ఏర్పాటు చేసినట్టు తెలిపింది.

  • Loading...

More Telugu News