: మరో 'సారీ'... కేసీఆర్ కు అపాయింట్ మెంట్ ఇవ్వని నరేంద్ర మోదీ
దేశ ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ సీఎం కేసీఆర్ కు మరోసారి షాకిచ్చారు. ప్రధానిని కలవాలని ఆయన చేసిన ప్రయత్నాలు మరోసారి విఫలం అయ్యాయి. రెండు రోజులపాటు ఢిల్లీలో ఉన్న ఆయన కేవలం కేంద్ర మంత్రులతో మాత్రమే సమావేశమై వెనుదిరగాల్సి వచ్చింది. మోదీని కలవాలని భావిస్తూ, ఢిల్లీకి వెళ్లిన ఆయనకు ప్రధాని అపాయింట్ మెంట్ దొరకలేదు. ప్రధాని మోదీతో తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన చర్చలు జరపాలని కేసీఆర్ భావించారు. అపాయింట్ మెంట్ లభించకపోవడంతో చేసేదేమీలేక, నిన్న సాయంత్రం ఆయన హైదరాబాదుకు తిరిగి వచ్చేశారు. ఇక్కడ ఇంకో విషయం ఏమంటే, కేసీఆర్ ను కలవని మోదీ, ఆయన కుమార్తె, పార్లమెంట్ సభ్యురాలు కవితతో మాత్రం ఐదు నిమిషాలు మాట్లాడారట!