: మోదీ సభావేదిక కూలి 46 మందికి గాయాలు
ఛత్తీస్ గఢ్ పర్యటనకు వెళ్లనున్న ప్రధాని సభ కోసం ఏర్పాటు చేసిన వేదిక కూలి 46 మంది గాయపడ్డారు. ఈ నెల 9న ప్రధాని నరేంద్రమోదీ ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని నయారాయ్ పూర్ లో మోదీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అందులో భాగంగా మోదీ సభ కోసం వేదిక నిర్మించారు. ఈదురుగాలులకు ఆ వేదిక కూలిపోయింది. ఆ సమయంలో దానికింద ఉన్న 46 మంది గాయపడ్డారు. వారిలో పోలీసులు, పార్టీ నేతలు ఉన్నారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో బహిరంగ సభను రద్దు చేస్తున్నట్టు పార్టీ నేతలు ప్రకటించారు.