: నిరాశ్రయురాలికి బుల్లి ఇల్లు కట్టి సెలబ్రిటీగా మారాడు


నిత్యం రోడ్డుపక్కన చాలామంది నిరుపేదలు, నిరాశ్రయులను చూస్తుంటాం. వారిని చూసినప్పుడు ఇలాంటి వారికి సహాయం చేయాలని భావించి మర్చిపోయేవారు కొందరైతే, సహాయం చేయడానికి ఉపక్రమించే వాళ్ళు మరికొందరుంటారు. అలాంటి కోవకే చెందుతాడు లాస్ ఏంజిలిస్ కు చెందిన ఎల్విన్ సమ్మర్స్. ఇల్లు లేక ఏళ్ల తరబడి వీధుల్లోనే జీవనం ఉంటున్న ఓ మహిళ దీనస్థితిని అర్థం చేసుకున్న ఎల్విస్, ఆమె కోసం 8 అడుగుల బుల్లి ఇల్లును చెక్కలతో స్వయంగా తయారు చేసి ఇచ్చాడు. పైగా ఇల్లు కట్టే వ్యవహారమంతా వీడియో తీసి యూట్యాబ్ లో అప్ లోడ్ చేశాడు. ఇల్లు లేని ఎంతోమందికి సహాయం చేయాలని భావిస్తున్నానని తన ఆశయాన్ని అందులో వ్యక్తం చేశాడు. దానికి యూట్యూబ్ లో విశేషమైన స్పందన వచ్చింది. ఈ వీడియోను 56 లక్షల మంది చూశారు. నెల రోజుల్లో దాదాపు 60 వేల డాలర్లు విరాళంగా అందించారు. ఈ ఇల్లు కట్టేందుకు కేవలం 500 డాలర్లే ఖర్చయిందని, విరాళంతో ఎన్నో ఇళ్లు కట్టవచ్చని, అలాంటి ఇళ్లు ఎన్నో తయారు చేస్తానని ఎల్విన్ చెబుతున్నాడు.

  • Loading...

More Telugu News