: ఆ హెలికాప్టర్ ను పేల్చింది మేమే, నవాజ్ షరీఫ్ ను కూడా హతమారుస్తాం: తాలిబన్ల హెచ్చరిక
పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను హతమార్చడమే తమ తదుపరి లక్ష్యమని తాలిబన్ వర్గాలు ప్రకటించాయి. ఈ మేరకు నేడు ఒక ప్రకటన వెలువరిస్తూ, పాక్ లో తాలిబన్లను అణచివేసే దిశగా నవాజ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రతీకారం తప్పక తీర్చుకుంటామని హెచ్చరించింది. ఈ ఉదయం గిలిగిత్ లోయలో హెలికాప్టర్ ను పేల్చింది తామేనని తాలిబన్లు ప్రకటించారు. ఆ హెలికాప్టర్ లో నవాజ్ ఉన్నాడని భావించామని తెలుపుతూ, తమ నుంచి ఆయన తప్పించుకోలేరని వ్యాఖ్యానించింది. ఈ ప్రమాదంలో నార్వే, ఫిలిప్పీన్స్ రాయబారులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తరువాత నవాజ్ తన ప్రయాణాన్ని విరమించుకున్న సంగతి తెలిసిందే.