: సోషల్ మీడియాతో అమెరికా యువతకు గాలం వేస్తున్న ఐఎస్
ప్రపంచ దేశాల్లో వణుకు పుట్టిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మిలిటెంట్ గ్రూపు అమెరికా యువతను ఆకర్షించేందుకు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటోందని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ) పేర్కొంది. తమ గ్రూపులో చేరేందుకు సామాజిక మాధ్యమం ద్వారా వేలాదిమందికి దరఖాస్తులు పంపుతోందని తెలిపింది. టెక్సాస్ ఆర్ట్ ఫెయిర్ పై దాడి ఘటనలో దర్యాప్తులో భాగంగా ఎఫ్ బీఐ పలు విషయాలు తెలుసుకుంది. ఇస్లామిక్ అతివాదం పట్ల ఆసక్తి కనబరుస్తున్న వ్యక్తులను గుర్తించి, వారి స్మార్ట్ ఫోన్లకు ట్విట్టర్ తదితర సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా ఐఎస్ గ్రూపు సందేశాలు పంపిస్తోందని ఎఫ్ బీఐ డైరెక్టర్ జేమ్స్ కామీ తెలిపారు. అమెరికాపై దాడులకు వారిని ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. ఐఎస్ తీరు వ్యక్తుల భుజాలపైకెక్కిన దయ్యం చంపు, చంపు, చంపు.... అని చెబుతున్నట్టుగా ఉందని అన్నారు.