: సల్మాన్ కేసులో విచారణ జూన్ కు వాయిదా


హిట్ అండ్ రన్ కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడిన నటుడు సల్మాన్ ఖాన్ కు తీవ్ర ఉత్కంఠ నడుమ ఊరట లభించింది. కేసులో సల్మానే కారు నడిపాడని ప్రాసిక్యూషన్ విచారణలో నిరూపణ కాలేదని, కారులో ఉన్న కమాల్ ఖాన్ అనే నాలుగో వ్యక్తి సాక్ష్యాన్ని సెషన్స్ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని డిఫెన్స్ న్యాయవాది అమిత్ దేశాయ్ వాదించారు. ఈ క్రమంలో సల్మాన్ కు విధించిన శిక్షను రద్దు చేయాలని కోరారు. ఆ వెంటనే ప్రాసిక్యూషన్ న్యాయవాది వాదనలు వినిపించాక సల్మాన్ కు బెయిల్ ఇస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను జూన్ 15కు వాయిదా వేసింది. వ్యక్తిగత పూచీకత్తు కింద రూ.30వేల బాండు సమర్పించాలని సల్మాన్ న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. సల్మాన్ పాస్ పోర్టు అప్పగించాలని కోర్టు స్పష్టం చేయగా, ఈ విషయంలో అమిత్ దేశాయ్ చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. తాజాగా ఈ కేసులో డిఫెన్స్ న్యాయవాది లేవనెత్తిన నాలుగో వ్యక్తి ఇచ్చే సాక్ష్యం మేరకు విచారణ జరగనుంది.

  • Loading...

More Telugu News