: మోదీని కలసిన టీడీపీ ఎంపీలు... ప్రత్యేక హోదా కల్పించాలని విజ్ఞప్తి
ప్రధానమంత్రి నరేంద్రమోదీని పార్లమెంట్ ఆవరణలో కేంద్ర మంత్రులు, టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజు, ఇతర టీడీపీ ఎంపీలు కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాల్సిన, రావల్సిన సదుపాయాలపై ప్రధానితో ఎంపీలు చర్చించారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని విజ్ఞప్తి చేసిన ఎంపీలు, విభజన చట్టం హామీలను నెరవేర్చాలని కోరారు. అంతేగాక పోలవరం ప్రాజెక్టుకు రూ.5వేల కోట్లు ఇవ్వాలని కోరారు. నూతన రాజధాని నిర్మాణానికి మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఏపీ కున్న లోటు బడ్జెట్ పూర్తి చేయాలని ప్రధానిని ఎంపీలు అడిగారు.