: ఆర్టీసీ కార్మికులపై కఠిన చర్యలు మొదలుపెట్టిన యాజమాన్యం


సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా, మంత్రులు, అధికారులు ఎంతగా విజ్ఞప్తి చేస్తున్నా సమ్మెను విరమించని ఆర్టీసీ కార్మికులపై యాజమాన్యం కఠిన చర్యలకు దిగింది. గుర్తింపు పొందిన ఆర్టీసీ సంఘాలకు డిపోల్లో ఉన్న ప్రత్యేక సదుపాయాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. క్రమశిక్షణా నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన యాజమాన్యం రాష్ట్ర, జోనల్, జిల్లా, డిపో స్థాయిలో ఎన్ఎంయూ, ఈయూ, టీఎన్ యూ, ఎన్ఎంయూ తదితర సంఘాలకు ఉన్న సదుపాయాలను, యూనియన్ కార్యాలయ గదుల సౌలభ్యాన్ని తొలగిస్తున్నట్టు తెలిపింది. కార్మికుల వేతనాల నుంచి సభ్యత్వ రుసుమును మినహాయించే సదుపాయాన్ని తొలగిస్తున్నట్టు వివరించింది. ఈ నిర్ణయాలను వెంటనే అమలు చేయాలని ఆర్టీసీ ఎండీ ఆదేశాలు జారీ చేశారు. యూనియన్ నేతలు విధులకు రాకుండా, వారిని యూనియన్ కార్యకలాపాలకు పరిమితం చేస్తూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తున్నట్టు కూడా యాజమాన్యం ప్రకటించింది. స్వయంగా సంస్థ ఉద్యోగులే ఆర్టీసీ బస్సులను అడ్డుకోవడంపై మండిపడింది.

  • Loading...

More Telugu News