: తృటిలో క్రాష్ నుంచి తప్పించుకున్న ఢిల్లీ డేర్ డెవిల్స్ విమానం


క్రీడా ప్రపంచంలో ఓ పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు సభ్యులంతా ప్రయాణిస్తున్న ఇండిగో విమానం రాయ్ పూర్ లోని స్వామి వివేకానంద ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన సమయంలో రన్ వేపై మరో విమానం నిలిచేవుంది. విమానం ల్యాండ్ అయిన తరువాత ఎదురుగా మరో విమానాన్ని గుర్తించిన పైలెట్ మరింత వేగంగా బ్రేకులు వేసి, ఫ్లయిట్ ను పక్కకు మళ్లించాడు. ఈ ఘటన నేటి మధ్యాహ్నం 12 గంటల సమయంలో జరిగినట్టు తెలుస్తోంది. రన్ వేపై విమానం టేకాఫ్ కు సిద్ధంగా ఉన్న సమయంలో మరో విమానం ల్యాండింగ్ కు అధికారులు అనుమతివ్వడం విమానయాన రంగంలో ఘోర తప్పిదం. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. కాగా, రేపు, 12వ తేదీన రాయ్ పూర్ లోని షహీద్ వీర్ నారాయణ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఢిల్లీ జట్టు మ్యాచ్ లను ఆడాల్సివుంది.

  • Loading...

More Telugu News