: సల్మాన్ జైలు శిక్ష నిలిపివేత ... బాంబే హైకోర్టు ఆదేశాలు
సల్మాన్ ఖాన్ కు విధించిన ఐదేళ్ల శిక్షపై బాంబే హైకోర్టు సస్పెన్షన్ విధించింది. సెషన్స్ కోర్టు తీర్పును నిలిపివేస్తున్నట్టు న్యాయమూర్తి థిప్సే తన తీర్పు వెలువరించారు. తాజా బెయిలు కోసం కొత్తగా మరిన్ని పూచీకత్తులు సమర్పించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో విచారణ అధికారుల నిర్లక్ష్యం కూడా కొంత కనిపిస్తోందని భావిస్తున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. అందువల్లే సల్మాన్ బెయిలుకు అర్హుడని ఆయన అన్నారు. అంతకుముందు ప్రాసిక్యూషన్ న్యాయవాది వాదిస్తూ, సల్మాన్ కు బెయిలు మంజూరు చేయరాదని కోరారు. ఆయన తీవ్రమైన నేరమే చేశారని, కోర్టును తప్పుదారి పట్టించాలని చూశాడని తెలిపారు. ఆ వాదనను జడ్జి పట్టించుకోలేదు.