: ఆ సమయంలో కారులో నాలుగో వ్యక్తి కూడా ఉన్నారు... హైకోర్టులో సల్మాన్ తరపున డిఫెన్స్ వాదన


బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు బెయిల్ మంజూరవుతుందా? లేక జైలుకు వెళతారా? అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనిపై బాంబే హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. సల్మాన్ తరపున ప్రముఖ న్యాయవాది అమిత్ దేశాయ్ వాదనలు వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన వాదిస్తూ, ఈ ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షి ఎవరూ లేరని కోర్టుకు విన్నవించారు. బాధితులు గాఢ నిద్రలో ఉన్నారని... ఏం జరిగిందో కూడా అర్థంకాని పరిస్థితిలో వారు ఉన్నారని చెప్పారు. దీనికి తోడు, ప్రమాద సమయంలో కారులోనే ఉన్న గాయకుడు కమాల్ ఖాన్ ను ప్రాసిక్యూషన్ విచారించలేదని తెలిపారు. అంతేకాకుండా, కారులో నాలుగో వ్యక్తి కూడా ఉన్నాడని... అతనే కారును డ్రైవ్ చేశాడని డిఫెన్స్ న్యాయవాది వాదించారు. అతని స్టేట్ మెంట్ ను కానీ, కారు టైర్ బరస్ట్ అయిన విషయాన్ని కానీ సెషన్స్ కోర్టు పరిగణలోకి తీసుకోలేదని హైకోర్టుకు విన్నవించారు.

  • Loading...

More Telugu News