: ప్రారంభమైన ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష ప్రారంభమైంది. రాష్ట్రంలో 455, హైదరాబాదులో 39 కేంద్రాల్లో ఎంసెట్ పరీక్ష జరుగుతోంది. ఏపీ, తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా అర్ధగంట సమయాన్ని సడలించారు. పరీక్ష 10 గంటలకు మొదలవుతుంది కాబట్టి ఆ తరువాత వచ్చే విద్యార్థులను కూడా పరీక్షకు అనుమతించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దాంతో పలువురు విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్ష జరగనుంది.