: హైదరాబాదు శివార్లలో బర్డ్ ఫ్లూ జాడలు


హైదరాబాదు శివారుల్లోని హయత్‌ నగర్ మండలంలోని కోళ్ల ఫారాల్లోని కోళ్లు పెద్ద సంఖ్యలో చనిపోతుండటంతో బర్డ్‌ ఫ్లూ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత కొంత కాలంగా ఎలాంటి కేసులు నమోదు కాకపోవడంతో బర్డ్ ఫ్లూ కాదని బావించిన రైతుల్లో తాజా ఘటనలు ఆందోళన రేపుతున్నాయి. హయత్‌ నగర్ మండలం ఇంజాపూర్ గ్రామంలో ఉన్న ఓ కోళ్లఫారంలో పది రోజులుగా కోళ్లు పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయి. నెల క్రితం తొర్రూరు గ్రామంలో బర్డ్‌ఫ్లూ సోకిన సమయంలో ఈ కోళ్ల ఫారం పరిశీలించిన వైద్యులు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో ధైర్యంగా ఉన్న రైతులు, గత మూడు రోజుల్లో 80 వేల కోళ్లలో 10 వేల కోళ్లు మృత్యువాత పడడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చికెన్ ఫెస్టివల్ నిర్వహించి చికెన్ అమ్మకాలు పెంచి నెల రోజులు కూడా పూర్తి కాకుండానే పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయని భావిస్తున్నారు. కాగా, దీనిపై పశు వైద్యాధికారి ఆనంద్‌రెడ్డి మాట్లాడుతూ, రైతు ఫిర్యాదుతో ఫారంలోని కోళ్ల శాంపుల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం పంపామని, ఫలితాలు వచ్చాకే బర్డ్‌ ఫ్లూ గురించి ఓ స్పష్టతకు రాగలమని చెప్పారు.

  • Loading...

More Telugu News