: సోషల్ మీడియాలో హింస ఒత్తిడి పెంచుతోంది
సోషల్ మీడియాలో వచ్చే హింసాత్మక ఘటనలకు సంబంధించిన వార్తలు ఒత్తిడి పెంచుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నిత్యజీవితంలో భాగమైన సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు, గ్రాఫిక్స్ రూపంలో ప్రత్యక్షమయ్యే హింసాత్మక ఘటనలు ఒత్తిడికి కారణమవుతున్నాయని యూకేలోని బ్రాడ్ ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ పామ్ రామ్ సదన్ అభిప్రాయపడ్డారు. ఈ అధ్యయనం కోసం 37 ఏళ్లలోపున్న 189 మందిని ఎంపిక చేసి వారిపై అధ్యయనం చేశారు. 9/11, ట్విన్ టవర్ పేలుళ్లు, బాంబు పేలుళ్లు వంటి ఘటనలు నేరుగా చూపించగా, వారిలో 22 శాతం మందిపై ఇవి ప్రభావం చూపి ఒత్తిడి పెంచినట్టు ఆయన తెలిపారు.