: నిర్భయ ఘటన కారణంగా జువైనల్ జస్టిస్ బిల్లుకు లోక్ సభ ఆమోదం
దేశాన్ని పట్టి కుదిపేసిన నిర్భయ ఘటన చట్టసవరణకు దారితీసింది. నిర్భయ ఘటనలో మైనర్ నిందితుడు స్వల్ప శిక్షతో తప్పించుకున్న ఘటన దేశ వ్యాప్త ఆందోళనకు దారితీసింది. అత్యంత క్రూరమైన నేరానికి పాల్పడిన దోషి, మైనర్ అన్న కారణంగా స్వల్ప శిక్షతో బయటపడడంతో జువైనల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ) చట్టం సవరణకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీంతో 16 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయసులోపు టీనేజర్లు హీనమైన నేరాలకు పాల్పడితే వారిని మేజర్లుగా పరిగణిస్తూ ప్రాసిక్యూషన్ నిర్వహించాలనే చట్ట సవరణ బిల్లును లోక్ సభ ఆమోదించింది. కేంద్ర మంత్రి మేనకా గాంధీ ప్రవేశపెట్టిన జువైనల్ జస్టిస్ చట్టసవరణ బిల్లును మెజారిటీ సభ్యులు ఆమోదించారు.